అశ్వారావుపేట బరిలో 14 మంది….

– మహిళలు ముగ్గురు..
– దమ్మపేట మండల నుండి ఏడుగురు..
– “కోయ”లు తొమ్మండుగురు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర సాదారణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాగంగా అశ్వారావుపేట – 118 (ఎస్టీ) నియోజక వర్గానికి మూడోసారి (2023 లో) జరుగుతున్న  ఎన్నికల్లో మొత్తం 14 మంది బరిలో నిలిచారు. వాస్తవానికి ఈ నియోజక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో ఏర్పాటు అయింది. అప్పటి నుండి ఇక్కడ నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నట్టు లెక్క. 2009 లో 10, 2014 లో 15, 2018 లో 12 పోటి పడగా తాజా ఎన్నికల్లో (2023)లో 14 మంది పోటీ పడుతున్నారు.
మహిళలదే హవా
ఈ నియోజకవర్గంలో మొదటి నుండి మహిళా ఓటర్లే అధికం. ఈ సారి సైతం పురుషులు 76,193, స్త్రీలు 79,761 మొత్తం 1,55,961 మంది ఓటర్లు. పురుషులు కంటే స్త్రీ ఓటర్లు 3,568 మంది అధికం. ఈ మహిళా ఓటర్లు తగ్గట్టుగా ఈ ఎన్నికల్లో ముగ్గురు మహిళా అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
 పోటీలో నిలిచిన మహిళలు
బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధి ముయ్యబోయిన ఉమాదేవి, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్ధి పద్దం వెంకట రమణ, స్వతంత్ర అభ్యర్ధిగా కుంజా నాగమణి ఈ ఎన్నికలలో తలపడుతున్నారు.
వయస్సుల వారీగా
కన్నెబోయిన వెంకట నర్సయ్య (గోండ్వానా గణతంత్ర పార్టీ) 57 ఏండ్లు
మెచ్చా నాగేశ్వరరావు (బీఆర్ఎస్)56 ఏండ్లు
కిషోర్ కల్లూరు (స్వతంత్ర) 51ఏండ్లు
ఆంగోతు క్రిష్ణ(స్వతంత్ర)48 ఏండ్లు,
అర్జున్ రావు పిట్టల (సీపీఐ(ఎం)) 47 ఏండ్లు
మడకం ప్రసాద్ (బిఎస్పీ)44 ఏండ్లు,
కుంజా నాగమణి(స్వతంత్ర)44 ఏండ్లు,
ఊకే ముక్తేశ్వరరావు(స్వతంత్ర)43 ఏండ్లు,
ఆదినారాయణ(కాంగ్రెస్)40 ఏండ్లు
మనుగొండ వెంకటముత్యం(బిసివైపి)40ఏండ్లు
తంబళ్ళ రవి(స్వతంత్ర)36 ఏండ్లు
పద్దం వెంకట రమణ (అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ)35 ఏండ్లు,
ముయ్యబోయిన ఉమాదేవి(జనసేన) 32 ఏండ్లు,
ఊకే రవి(గోండ్వానా దండకారణ్య పార్టీ)30 ఏండ్లు.
కులాలు వారీగా
గిరిజనుల్లో మూడు ఉపతెగలకు చెందిన వారు పోటి చేస్తున్నారు. కోయ ఉపకులానికి చెందిన ఆదినారాయణ జారే, మడకం ప్రసాద్, మెచ్చా నాగేశ్వరరావు, ఊకే రవి, పద్దం వెంకట రమణ, ముయ్యబోయిన ఉమాదేవి, ఊకే ముక్తేశ్వర రావు, కిషోర్ కల్లూరు, కుంజా నాగమణి ఉన్నారు. నాయక పోడు తెగకు చెందిన అర్జున్ రావు పిట్టల,కన్నెబోయిన వెంకట నర్సయ్య,మనుగొండ వెంకట ముత్యం, తంబళ్ళ రవి పోటీపడుతున్నారు.
లంబాడి తెగకు చెందిన ఆంగోతు క్రిష్ణ ఒకరు ఉన్నారు. నియోజక వర్గంలో 5 మండలాలు ఉండగా 4 మండలాల నుండి పోటీలో ఉన్నారు.ఇందులో దమ్మపేట మండలం వారే అధికంగా ఉండటం గమనార్హం. ఆదినారాయణ జారే(గండుగులపల్లి), ఆంగోతు క్రిష్ణ(నాగుపల్లి), కుంజా నాగమణి(నాగుపల్లి), మెచ్చానాగేశ్వరరావు(తాటి సుబ్బన్న గూడెం), ముయ్యబోయిన ఉమాదేవి(మారెప్పగూడెం), అర్జున్ రావు పిట్టల(ముకుందాపురం), దమ్మపేట మండలంకు చెందినవారు. ములకలపల్లి మండలానికి చెందినవారు కన్నెబోయిన వెంకట నర్సయ్య(ములకలపల్లి), ఊకే రవి(చౌటుగూడెం), కిషోర్ కల్లూరు(ముత్యాలమ్మ పాడు). అన్నపురెడ్డిపల్లికి చెందిన వారు పద్దం వెంకట రమణ(పెద్ది రెడ్డిగూడెం – ఎర్ర గుంట), ఊకే ముక్తేశ్వరరావు(తొట్టి పెంపు) ఉన్నారు.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలానికి చెందిన మడకం ప్రసాద్(నందిపాడు), మనుగొండ వెంకట ముత్యం (నారంవారిగూడెం) వారు ఉన్నారు. తంబళ్ళ రవి ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలం, ఏన్కూరు గ్రామం, చెరువు బజార్ కు చెందిన వారు కావడం విశేషం.