14 ద్విచక్రవాహనల పట్టివేత..

– ఇద్దరి అరెస్టు రిమాండ్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి, హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రాంతాలలో దొంగతనలు చేసిన బోదన్ పట్టణంలోని అచన్ పల్లి కి చెందిన షేక్ సోహెల్, బోదన్ పట్టణంలోని రాకాసి పేట్ కు చెందిన  సయ్యద్ జమీల్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 14 ద్విచక్రవాహనల ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి నట్లు ఎస్ ఐ యు మహేష్ తెలిపారు. అయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గత నేలా 30 న డిచ్ పల్లి మండలం లోని నడ్పల్లి గ్రామానికి చెందిన మామిడాల సురేష్ తన యొక్క పల్సర్ బైక్ నంబర్ ts 16 et 6880 మండల కేంద్రంలోని  గ్రోమర్ దుకాణం దెగ్గర తన అపార్ట్మెంట్ ముందు 30 ఆగస్టు రాత్రి సమయం లో పార్క్ చేసి మరుసటి రోజు 31న చూడగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనం ను ఎత్తు కొని వేళ్ళినట్లు పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. బుదవారం  నిందితులు అయిన (A-1) షేక్ సోహెల్ మరియు (A-2) సయ్యద్ జమీల్ ఇద్దరు కలిసి ఈ రోజు తేదీ : 13.09.2023 నాడు ఉదయం 04:30 గంటల సమయంలో నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ పై నిజామాబాద్ నుండి డిచ్ పల్లి వైపు వాస్తుండగా డిచ్ పల్లి ఎస్ఐ మహేష్ సిబ్బందితో కలిసి డిచ్ పల్లి రైల్వే స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీ  చేస్తుండగా అనుమనస్పదంగా కనిపించిన వీరిని ఆపి విచారించగా నింధితులు వారు చేసిన దొంగతనలకు సంబంధించిన వాటిని వివరించినట్లు తెలిపారు. నింధితులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 14 ద్విచక్రవాహనల ను స్వాధీన చేసుకొని అరెస్ట్ చేసి, నిందితుల  బందువులకు విషయం తెలిపినట్లు వివరించారు.నిందితుల నుండి పల్సర్ బైక్ లు -12, రాయల్ ఎన్ఫీల్డ్ 1,ఆక్టివా 6g  01ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఈ కేసు ను చేదించడానికి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్య నారాయణ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసిపి ఎం. కిరణ్ కుమార్ ఆద్వర్యంలో ఈ కేసు ను చాకచక్యంగా టెక్నాలజీ ద్వారా చేదించిన డిచ్ పల్లి సిఐ కె కృష్ణ, ఎస్ఐ యు మహేష్, సిబ్బంది సుదాకర్, రాజేశ్వర్, సర్దార్ , రాము, సందీప్, లను అభినందించారు.
ప్రజలకు గమనిక..
నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి మండల ప్రజలు తమా వాహనాలను జాగ్రత్తగా తాళాలు వేసి రాత్రి సమయాల్లో ఇంటి లోపల ఆవరణం లో పార్క్ చేసుకోవాలని, రాత్రి సమయం లో ఎవరైనా అనుమానస్పదంగా తిరిగినట్లు కనిపిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.