లోప భూఇష్టంగా ఉన్న 142 జీఓ ను రద్దు చేయాలి

– జీవో రద్దు చేయకుంటే ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఆందోళనలు

– జీవో రద్దు పోరాట కమిటీ డిమాండ్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచేందుగాను మానవ వనరులను హేతుబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం  విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 142 లోప భూ ఇష్టంగా ఉందని  142 జీఓ రద్దు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శనివారం కోఠి డిహెచ్ కార్యాలయం ముందు వారు మాట్లాడుతూ..వైద్య ఆరోగ్య ఉద్యోగులకు, రాష్ట్ర ప్రజలకు,మొత్తంగా వైద్య ఆరోగ్య రంగానికె గొడ్డలి పెట్టు లాంటి ఈ జీ వో 142 వెంటనే రద్దు చేయాలని వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని యూనియన్లు క్యాడరసోసియేషన్లు ఏకతాటి పైకి వచ్చి గత ప్రభుత్వం పైకి ఒత్తిడి తీసుకువచ్చి తాత్కాలికంగా ఆపివేయడం జరిగిందని పేర్కొంటూ, ఈ మధ్యలో కొంతమంది అధికారులు మళ్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఈ జీవోను ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, నూతనంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ ఇట్టి జీవోను అన్ని సంఘాలతో  ఈనెల 20వ తేదీన చర్చించిన తర్వాత తదుపరి గవర్నమెంట్ కు విన్నవిస్తామని వ్రాతపూర్వకముగా ఇవ్వడం జరిగిందన్నారు. మానవ వనరుల హేతుబద్ధీకరణ అనేది జనాభా ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించడం కోసం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో అపారమైన అనుభవం ఉన్న, క్షేత్రస్థాయిలో పనిచేసిన వైద్య ఆరోగ్య రాష్ట్ర ఉన్నతాధికారులనుండి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులనుండి క్షేత్రస్థాయి సమాచారాన్ని,సలహాలు సూచనలు తీసుకోకుండ తమ ఇష్టానుసారంగా ఈ జీవోను విడుదల చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్రవ్యాప్తంగా 4318 పోస్టులను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని వెంటనే రద్దు చేయాలని  142 జీవో రద్దు పోరాట కమిటీ పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటే వైద్య ఆరోగ్య శాఖ కనీసం 50 సంవత్సరాల భవిష్యత్తు అవసరాల ను దృష్టిలొ పెట్టు కొని చేస్తారనుకుంటాము , కానీ రాబోవు తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 142 జీవో ద్వారా సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, రాష్ట్ర ఉన్నతాధికారి తనకు సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్లను సీనియార్టీతో సంబంధం లేకుండా జిల్లాలకు డిఎంహెచ్వోలుగా ఏడిపియె హెచ్ ఓ గా నియమించడం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకమని డిప్యూటీ డి ఎం డి ఎం అండ్ హెచ్ ఓ ఆఫీసులను, టిబి సానిటోరియం, రాష్ట్ర స్థాయి శిక్షణా కేంద్రాలు తదితర శాఖలను ఎత్తివేయడాన్ని ఖండిస్తూ కొన్ని పోస్టులను అవసరంలేదని రద్దు చేయడం అప్రజా స్వామికమని అందరూ పని చేస్తేనే ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ జీఓ ద్వారా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం పటిష్ట పరిచేందుకు కొత్త గా జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, పరిపాలన అధికారులు, కార్యాలయ పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్, తదితర పోస్టులు సృష్టించిన పాత డైరెక్టర్ గారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పోస్టు ను క్రియేట్ చేయలేక పోవడము లోని చిదంబర రహాస్యం ఏమిటో తెలియడం లేదు. అంతేకాకుండా నూతన జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం లో మాత్రం నూతన పోస్టులు క్రియేట్ చేయక పోవడంతో పాటు ఉన్న పారా మెడికల్ సిబ్బంది పోస్టులను ఎత్తివేయడం, సిహెచ్ వోలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ చేసిన హెల్త్ ఎడ్యుకేటర్లను పరిగణలోకి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం.142 జీవో లో పేర్కొన్న అనెక్సర్స్ VI & VIII ఆదారంగా పనిలో లేని ఇన్స్టిట్యూట్స్ పేరు తో రద్దు చేస్తున్నవి 123 ( పి పి యూనిట్స్) ఇది ఎంత హాస్యాస్పదమైనదంటే… టీవీవీపీ హాస్పిటల్స్ కు అనుబంధంగా ఉంటూ పుట్టిన పిల్లలకు ప్రతి రోజు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగు తుంది. హెల్త్ అసిస్టెంట్స్, సూపర్వైజర్ సిబ్బంది, మిగతా సిబ్బంది కనీసం 10 మంది పనిచేసే పి పి యూనిట్ ఏవిధంగా నాన్ ఫంక్షనింగ్ యూనిట్ అనేది తయారు చేసిన మహానుభావునికి తెలియాలి. 123 ఇన్స్టిట్యూట్ ను రద్దు చేయడంతో మన డిపార్ట్మెంట్ కోల్పోతున్న ఉద్యోగాలు 4318 వీటిలో ముఖ్యమైనవి .  ఆఫీస్ సబార్డినేట్స్ 702 ,ఎమ్మెన్వోలు – 227 ఎస్ ఎన్ ఓ లు -56 హెల్త్ అసిస్టెంట్ మెల్స్ -447 . తోటి, కామాటి, క్లీనర్ , వాచ్మెన్ మెుదలైన నాల్గవ తరగతి పోస్ట్ లు దాదాపుగా మరో 300 పైచిలుకు పోతున్నాయి అన్నారు. ఇక మన ఆరోగ్య కేంద్రాన్ని ఊడ్చే వారు, తూడ్చే వారు భవిష్యత్తులో ఎవరూ మిగలరు . ఏపిఎమ్ఓ 298, డిపిఎమ్ఓ 69, డ్రైవర్లు 195 . ఇలా అనేక క్యాడర్ లు కనుమరుగై పోతాయి అన్నారు. అనేక్సర్ IV – ఏ ప్రకారం 636 PHC లు అన్నింటిలొ స్టాఫ్ ఒకే విధంగా ఉండాలని ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడకూడా సమాన నిష్పత్తిలో ఉన్న దాఖలాలు కనిపించడం లేదు జిల్లాల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా వివిధ క్యాడర్లను విభజించినప్పుడు ఒక్కో జిల్లాకు ఒక్కో క్యాడర్ను విభజిస్తూ ఇష్ట రాజ్యంగా విభజించారని వారు పేర్కొన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూర్పులో అటెండర్,స్లీపర్. పోస్ట్ లేదుసీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లేదు. అంటే మెడికల్ ఆఫీసర్ కు డ్రాయింగ్ పవర్స్ లేదని చెప్పకనే చెబుతున్నారు. 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి నైట్ వాచ్ట్ మెన్ పోస్ట్ చూపించలేదు. రాత్రి వేళ లో మహిళా ఉద్యోగులను పని చేయమని చెప్పి సెక్యూరిటీ విషయం చూసుకోకపోవడం దురదృష్టకరం. కానీ కొంతమంది పాత ఉన్నతాధికారులు అత్యుత్సాహంతో ఈ జీవోను ఇంప్లిమెంటేషన్ చేయించడానికి దొడ్డివారిన ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని, ఈరోజు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారి సమక్షంలో అన్ని ట్రేడ్ యూనియన్లు అసోసియేషన్లు ముక్తకంఠంతో 142 జీవోను రద్దు చేయాలని తెలియజేయడం జరిగింది దీనికి డైరెక్టర్ గారు సానుకూలంగా  స్పందిస్తూ యూనియన్లు అసోసియేషన్లు తెలియజేసిన నిర్ణయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు. యూనియన్లు, అసోసియేషన్లు ఒకవేళ 142 జీవో రద్దు చేయని యెడల వైద్య ఆరోగ్యశాఖలోని మొత్తం ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు వేచి చూసి ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఆందోళన కార్యక్రమం లోకి వెళ్లడం జరుగుతుందని వారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ప్రజారోగ్య ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, శ్యాంసుందర్, సీఐటీయూ యాద నాయక్,  రాబట్టు బూస్, హెచ్ వన్ యూనియన్  సాయి రెడ్డి, కిరణ్ రెడ్డి,  మీడియా ఆఫీసర్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు  ప్రసాద్, కిరణ్ వెంకటేశ్వర్లు, సిహెచ్ ఓ అసోసి నెహ్ర చందు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లను సంఘం  కలిముద్దీన్, శ్రీనివాస్, డాక్టర్ల అసోసియేషన్ నుండి వినోద్, లక్ష్మణ్, జయశ్రీ ఫార్మసీ అసోసియేషన్ సుదర్శన్ గౌడ్, ఆప్తాల మీకు ఆఫీసర్ వచ్చే నుండి ప్రసాద్, డీపీఎం అసోసియేషన్  దేవ్ సింగ్, ఏఎన్ఎం హెచ్.పీ అసోసియేషన్ నుండి రామలక్ష్మి, అనసూయ, రామేశ్వరి మహాల, వేణుగోపాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.