ఉచిత కౌన్సిలింగ్ కొరకు 14416 టోల్ ఫ్రీ నెంబర్..

14416 toll free number for free counselling..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రతి ఒక్కరూ పొగాకు రహిత యువ సమాజాన్ని నిర్మించడాని కృషి చేయాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. పొగాకు రహిత విద్యాసంస్థల ఏర్పాటులో భాగంగా గురువారం పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యువత పొగాకు ఉత్పత్తులకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన కలిగే అనర్ధాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి దూరంగా ఉండాలంటే పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలని తెలిపారు. సిగరెట్లు తాగడం, గుట్కా, కైని, అంబర్ లాంటి పదార్థాలు వాడటం వలన నోటికాన్సర్ తో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయని తెలిపారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం వారిచే అమ్మించడం కొట్పా చట్టం ప్రకారం నేరమని తెలిపారు. ఎవరైనా మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పిల్లలు ఎవరైనా పొగాకు ఉత్పత్తులు వాడినట్లు తల్లిదండ్రులు గుర్తిస్తే తమ దగ్గర్లోని మానసిక నిపుణుల వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఉచిత కౌన్సిలింగ్ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం, వైస్ ప్రిన్సిపాల్ రఘు, అధ్యాపకులు చవాన్ అనిత, సోషల్ వర్కర్ చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు.