యూకో బ్యాంక్‌ లాభాల్లో 147 శాతం వృద్థి

147 percent growth in UCO Bank's profitsహైదరాబాద్‌: ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 147 శాతం వృద్థితో రూ.551 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.223 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో బ్యాంక్‌ వ్యాపారం 11.46 శాతం పెరిగి రూ.4,61,408 కోట్లకు చేరింది. స్థూల అడ్వాన్సులు 17.64 శాతం వృద్థితో రూ.1,93,253 కోట్లుగా చోటు చేసుకుంది. మొత్తం డిపాజిట్లు 7.39 శాతం పెరిగి రూ.2,68,155 కోట్లకు చేరాయి. క్రితం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో యూకో బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 116 బేసిస్‌ పాయింట్లు తగ్గి 3.32 శాతానికి పరిమితం కాగా.. నికర ఎన్‌పిఎలు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గి 0.78 శాతానికి దిగివచ్చాయి.