ఘనంగా 14వ జాతీయ ఓటర్ దినోత్సవం..

నవతెలంగాణ-గోవిందరావుపేట
14వ జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం మండల కేంద్రంలో మండల ఎన్నికల అధికారి అయిన తాహసిల్దార్ సృజన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓటర్లతో కలిసి 153 వ జాతీయ రహదారిపై హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుండి దుంపలగూడెం సర్కిల్ రోడ్డు వరకు ర్యాలీ కార్యక్రమాన్ని జరిపారు. సీనియర్ సిటిజన్స్ సామ మోహన్ రెడ్డి, పూలమ్మ లను మరియు కొత్త ఓటర్ నువ్వు కూడా ఈ సందర్భంగా సత్కరించారు. కొత్త ఓటర్లతో ఓటర్ దినోత్సవ కార్యక్రమ ప్రమాణం చేయించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా నిర్భయంగా వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ డిప్యూటీ తాసిల్దార్ మమత ఆర్ఐలు రాజేందర్, సుధాకర్ రెవెన్యూ సిబ్బంది ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ బూతు లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.