– సీఎస్ ఓఎస్డీ విద్యాసాగర్‌కు యూఎస్‌పీసీ వినతి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, పెన్షనర్లకు ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిం చడం పట్ల తీవ్ర అసంతృప్తి ఉందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) విమర్శిం చింది. 15 శాతానికి తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి (సీఎస్) ఓఎస్డీ విద్యాసాగర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయం లో యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్‌కుమార్, పి నాగిరెడ్డి, టి లింగారెడ్డి, రామకృష్ణ, టి లక్ష్మారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. రెండో పీఆర్సీ కమిటీని నియమించ డాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఐదు శాతం ఐఆర్ ప్రకటించ డాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామని పేర్కొన్నారు. ఇప్పుడున్న జీవన వ్యయ ప్రమాణాలు, పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించడానికి వీలుగా వేతనాలను నిర్ణయిం చాలని కోరారు.
2023, జులై ఒకటి నుంచి అమలు జరగాల్సిన పీఆర్సీ ఆలస్యం అవుతున్న సందర్భంగా ఐఆర్ ప్రకటించా రని తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ఉద్యోగుల గౌరవప్రదమైన జీవితం కోసం మంచి వేతనాలు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇటీవల ప్రకటిం చిన ఐఆర్ అందుక నుగుణంగా లేకపోగా ఉద్యోగులను అవమా నించేలా ఉందని విమర్శించారు. ఐదు శాతం ఐఆర్‌ను సవరించి కనీసం 15 శాతం మంజూరు చేయాలని కోరారు.