నవతెలంగాణ – లోకేశ్వరం
మండలంలోని నగర్ గ్రామ శివారులో పేకాడుతున్న పదిహేను మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. పక్క సమాచారం మేరకు మంగళవారం నగర్ గ్రామ శివారులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా రహస్యంగా పేకాడుతున్న పదిహేను మందిని పట్టుకొని వారి దగ్గరి నుంచి రూ.6440 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.