కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి..

– 10 గొర్రెల పరిస్థితి విషమం..

– రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం..
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన మెరుగు ముత్తెన్నకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మండల పశువైద్యాధికారిణి రాజ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్గట్లకు చెందిన మెరుగు ముత్తెన్న గొర్రెలు కొట్టంలో నిద్రిస్తున్న సమయంలో కుక్కలు మందపై దాడిచేయడంతో 15 గొర్రెలు చనిపోయాయని,10 గొర్రెల పరిస్థితి విషమంగా ఉందని,20 గొర్రెలకు చిన్నచిన్న గాయాలయ్యాయని తెలిపారు. దాదాపు రూ.2 లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… బ్రతుకు దేరువు కోసం అప్పుచేసి గొర్రెలను కొనుగోలు చేశామని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.