బాబు అపరేషనుకు 15వేల ఆర్థిక సాయం..

– మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్..
నవతెలంగాణ వేములవాడ రూరల్ 
ప్రాణంతో పోరాడుతున్న చిన్నారి బాబుకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శుక్రవారం దాతల ద్వారా విరాళాలను స్వీకరించిన డబ్బులను బాబు ఆపరేషన్ కు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వేములవాడ పట్టణం, అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరెల్లి విజయ్ కుమారుడు ఊపిరితిత్తు లలో రక్తస్రావంతో బాధ పడుతుండగా సిరిసిల్ల కరీంనగర్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ అంకుర హాస్పిటలుకు తీసుకుని వెళ్లినట్లు అక్కడ ఐసియూలో చికిత్స జరుగుతున్నట్లు అబ్బాయి తండ్రి విజయ్ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు తెలియజేశారు. చిన్నారి పాపకు ఆపరేషనుకు మీవంతు సహాయ సహకారాలు అందించండి అని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను కోరడంతో ట్రస్టు, ఇతర సోషల్ మీడియా గ్రూపులో పోస్ట్ చేయడం తొ దాతలు మానవతా దృక్పథంతో స్పందించి 14319/- రూపాయలు ఆర్థిక సాయం అందించ డంతో ట్రస్ట్ ద్వారా మరి కొంతకలిపి చిన్నారిబాబు ఆపరేషనుకు 15వేల రూపాయాల చెక్కు ఆర్థిక సాయంగా భాదితుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, వొడ్యాల వేణు, పొలాస రాజేందర్, తోట రాజు, నంది సాయికుమార్, నాగుల నాగరాజు, చింతల లక్ష్మణ్, బాబు కుటుంబ సభ్యులు తో పాటు తదితరులు ఉన్నారు.