ముంబయి: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ 2024 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.15,138కోట్ల నికరలాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికం లోని రూ.16,011కోట్ల లాభాలతో పోల్చితే 5శాతం తగ్గుదల చోటు చేసుకుంది. కాగా.. కంపెనీ రెవెన్యూ 12 శాతం పెరిగి రూ.2.36 లక్షల కోట్లకు చేరింది. గడిచిన జూన్ త్రైమాసికంలో రిలయన్స్ జియో రెవెన్యూ 13 శాతం పెరిగి రూ.29.449 కోట్లకు చేరింది. కంపెనీ నికర లాభాలు 12 శాతం వృద్ధితో రూ.5,698 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం మూడు మాసాల్లో కొత్తగా 80 లక్షల మంది వినియోగదారులు చేరారని ఆ సంస్థ తెలిపింది. ప్రతీ వినియోగదారుడి నుంచి సగటు రాబడి రూ.181.7గా నమోదయ్యింది.