– జనవరి 25న సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహణ
నవతెలంగాణ – సిరిసిల్ల
నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్ తో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఝ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ.. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ నమోదు పెంపు, ఎథికల్ ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తామని, ఈ సంవత్సరం నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్ తో వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలోని ప్రతి బూత్ స్థాయి అధికారి పోలింగ్ స్టేషన్ పరిధిలో నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ, వృద్ద ఓటర్ల సన్మానం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి గ్రామం, వార్డులలో ఓటర్ ప్లేడ్జ్ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జనవరి 25న ఉదయం 11 గంటలకు జరిగే జిల్లా స్థాయి జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.