ప్రమాణ స్వీకారం చేసిన పద్మశాలి తర్ప 16 నూతన కార్యవర్గం

నవతెలంగాణ – కంటేశ్వర్
పద్మశాలి దర్ప 16 నూతన కార్యవర్గం ఆదివారం న్యాల్కల్ రోడ్ లో గల పద్మశాలి సంఘం తర్ప 16 లో ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అవదూత రాములు కార్యవర్గం ముఖ్య అతిధిగా వచ్చిన జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు దీకొండ యాదగిరి  సమక్షంలో అధ్యక్షుడు అవదూత రాములు, ప్రధాన కార్యదర్శి సబ్బని రవి కుమార్ ,కోశాధికారి బిల్ల లింబాద్రి,ఉపాధ్యక్షులు పెంటి దుర్గాదాస్,వాసం రవీందర్,సూరం రమేష్,సహాయ కార్యదర్శులు బొద్దుల రామకృష్ణ,వల్లకాటి ప్రణీత్,గంజి రాజు ప్రమాణ స్వీకారం చేసారు.అలాగే సంఘ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకార్యాలు ఎల్లప్పుడూ ఉంటాయని యాదగిరి పేర్కొన్నారు.తదుపరి వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హనుమండ్లు మాట్లాడుతూ.. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ సంఘం అభివృద్ధి పాదంలో నడిపి జిల్లా లోనే పేరు తెచ్చుకోవాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం కార్యదర్శి ఏనుగందుల మురళి,మాజీ జిల్లా అధ్యక్షుడు సత్యపాల్ ,మాజి ఉపాధక్షడు రవి ,తర్ప 16 మాజి అధ్యక్షుడు దోర్నాల రాజు, సబ్బని ప్రసాద్,మ్యాన ఎల్లయ్య పాల్గొన్నారు.