సైయంట్‌ లాభాల్లో 16 శాతం వృద్థి

హైదరాబాద్‌: గడిచిన ఆర్థిక సంవత్సం (2023-24) జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో సైయంట్‌ కంపెనీ 15.9 శాతం వృద్థితో రూ.189 కోట్ల నికర లాభాలు సాధించింది. కంపెనీ రెవెన్యూ 6.3 శాతం పెరిగి రూ.1,861 కోట్లకు చేరింది. మొత్తం రెవెన్యూలో డిజిటల్‌, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సెగ్మెంట్‌ 80 శాతం వాటాను కలిగి ఉంది. 2024-25లో తమ సంస్థ ఆర్డర్‌ బుక్‌ బలంగా ఉందని.. ఇంటిలిజెంట్‌ ఇంజనీరింగ్‌, టెక్నాలాజీ సొల్యూషన్స్‌పై పెట్టుబడుల దృష్టి కొనసాగుతుందని సైయంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిష్ణ బొడనపు తెలిపారు. గురువారం బీఎస్‌ఈలో సైయంట్‌ లిమిటెడ్‌ షేర్‌ 1.27 శాతం పెరిగి రూ.1,916 వద్ద ముగిసింది.