13 మంది..16 సెట్ల నామినేషన్లు

నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా  5 వ రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు  16 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టపద్రుల నియోజకవర్గం  అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్. మహేందర్ జి కి వీరు నామినేషన్లను సమర్పించారు.సోమవారం నామినేషన్లు సమర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నుండి ముండ్ర మల్లికార్జునరావు 2  సెట్ల నామినేషన్లను, ధర్మ సమాజ్ పార్టీ నుండి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్  1 సెట్ నామినేషన్, బిఆర్ఎస్  నుండి ఆనుగుల రాకేష్  1 సెట్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కర్ని రవి  1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు.  స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత 2 సెట్ల నామినేషన్లు,  చీదల్ల వెంకట సాంబశివరావు 1 సెట్, చీదల్ల ఉమామహేశ్వరి 1 సెట్, తాడిశెట్టి క్రాంతి కుమార్ 1 సెట్, అయితగోని రాఘవేంద్ర 1 సెట్, భక్కా  జడ్సన్ 1  సెట్, బుగ్గ శ్రీకాంత్ 1 సెట్, పాలకూరి అశోక్ కుమార్  1 సెట్, దేశ గాని సాంబశివరావు  1 సెట్ నామినేషన్లను దాఖలు చేశారు.