
ఈనెల 16న ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సును నిజామాబాద్ జిల్లాలోని శ్రావ్య గార్డెన్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ సోమవారం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఆమోదించబడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు అమలు చేయకపోవడం దీనివల్ల మాదిగ జాతి, ఉప కులాల ప్రజలకు తీవ్ర అన్యాయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయకపోవడం వల్ల మాదిగ జాతి తీవ్రంగా ఉద్యోగ రంగంలో నష్టపోతుందని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని నిజాంబాద్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేయనున్నది ఇట్టి సదస్సులు మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తొందరగా వర్గీకరణ చేయకపోతే మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం కొనసాగుతుంది. ఈ సదస్సుకు 33 జిల్లాల ఎమ్మార్పీ శ్రేణులు, అనుబంధ సంఘాల సమయంలో విచ్చేస్తున్నారు కావున నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మార్పీఎస్ శ్రేణులు, అనుబంధ సంఘాల ఉద్యోగస్తులు అధిక మొత్తంలో హాజరై రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు మైలారం బాలు, మాదిగ ఉద్యోగస్తుల జాతీయ నాయకులు తెడ్డు గంగారాం మాదిగ, మాదిగ ఉద్యమస్తుల రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ మాదిగ, జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మైలారం గంగాధర్ మారుతి, గద్దల రమేష్ తదితరులు పాల్గొన్నారు.