16న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి

నవతెలంగాణ – కంటేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిజామాబాద్ డిఇ ఓ  కి వినతి పత్రం సమ్మె నోటీసు  బుధవారం ఇవ్వడం జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్ జాన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ సామాన్య ప్రజలు కార్మికుల కర్షకులు హక్కులపై దాడి చేస్తున్నది. పేదలకు ఉపయోగపడే స్కీములను ప్రైవేటీకరణ చేస్తూ కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మికులకు కట్టుబార్నిశలుగా చేసి మార్చింది కాబట్టి 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫారం యూనియన్సు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ జిల్లా వ్యాప్తంగా ఆరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై నిరసనగా వంట బందు చేసి గ్రామీణ బందును విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే డీఈవో గారికి వినతిపత్రం ఇస్తూ 2013లో 45 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీం వర్కర్లు కార్మికుల గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనాలు చెల్లించాలని, 18 సంవత్సరాల గడుస్తున్న చేయలేక ఎండిఎం వర్కర్లు నష్టపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తివేసి, పేద పిల్లలకు ఆకలికేకల్లోకి నెట్టే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గాలకు కళ్లెం వేయాలని, కార్మికులుగా గుర్తించిన కనీస వేతనం రూ.16000 మన ఉద్యోగ భద్రత కాపాడుకోవడానికి 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బందులో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎండిఎం  జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి ఎండిఎం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.