మున్నూరు కాపు జిల్లా కేంద్ర భవన నిర్మాణానికి 16 వేల విరాళం

నవతెలంగాణ- మద్నూర్

మున్నూరు కాపు సంఘం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన భవన నిర్మాణానికి మద్నూర్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సారంగుల వార్ గంగారం ఆదివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు మామిళ్ళ అంజయ్యకు విరాళంగా 16 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మామిళ్ళ అంజయ్య మాట్లాడుతూ 16 వేల రూపాయలు విరాళంగా అందజేసిన ఎస్ గంగారామ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవనం నిర్మిస్తే జిల్లా కేంద్రానికి వచ్చే మున్నూరు కాపులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. సంఘ భవన నిర్మాణానికి విరాళాలు అందించడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులతో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.