గ్రామభారతి ఆధ్వర్యంలో 16వ మూలం సంత

నవతెలంగాణ-పెద్దవూర 

గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ భారతి మరియు సీఎస్ఆర్ మెమోరియల్ పౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 16 వ మూలం సంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షురాలు సూర్యకళ తెలిపారు. గురువారం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ పెద్దవూర మండల కేంద్రం లో నవతెలంగాణతో మాట్లాడారు. ఈ నెల 16 న తార్నాకాలోని మర్రికృష్ణ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల సంత జరుగుతుందని తెలిపారు.గ్రామ భారతి సంస్థ ప్రారంభమై 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి శనివారం వారాంతపు సంత లేదా నెలవారి సంత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంతలో గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు గోఉత్పత్తులు,మిద్దెతోట, దేశీ విత్తనాలు, మొక్కలు వ్యవసాయ విలువ జోడింపు ఉత్పత్తులు, ఆయుర్వేద, పంచగవ్య లాంటి ఆరోగ్య విషయాలు, ప్రకృతి మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు,దేశం, ధర్మం, ప్రకృతి వ్యవసాయం మరియు పాడిపై పుస్తకాలు,చేనేత దుస్తులు, వస్త్రాలు,కుల వృత్తులు, చేతి వృత్తులు తినుబండారాలు,వీటికి సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన మిల్లెట్‌ ఆహారం, నోరూరించే మిల్లెట్స్‌ ఐస్‌క్రీం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఈసారి అదనపు ఆకర్షణగా సర్వపిండి, మిల్లెట్ చాప్, స్వీట్ మెమో, రోల్, ఎల్లేట్ మునగాకు స్పెషల్ రైస్, ఉచితంగా అందించ బడునని తెలిపారు. ప్లాస్టిక్ నివారణక కొరకు చేతి సంచి తీసుకొని వచ్చి పర్యావరణం కాపాడాలని తెలిపారు.