17 న కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా సీతారాముల కళ్యాణం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ 69వ జన్మదినం సందర్భంగా నల్లకుంట పురాతన రామాలయ మందిరంలో ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించనున్నట్టు కేసీఆర్‌ చిన్ననాటి గురువు తెలుగు పండిట్‌ వలేటి మృత్యుంజయ శర్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్సవంలో సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో పాటు 11 జంటలు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్‌ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.