డాక్టర్‌ రెడ్డీస్‌ లాభాల్లో 18% వృద్థి

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ 18 శాతం వృద్థితో రూ.1,402.5 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడా ది ఇదే త్రైమాసికంలో రూ.1,187.6 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.1,221 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ1లో 149 శాతం పెరిగి రూ.1,763.3 కోట్ల రెవెన్యూ నమోదయ్యింది.