
నవతెలంగాణ హైదరాబాద్: పోలీస్ కాన్వాయ్ పై దుండగులు దాడి చేసిన ఘటనలో 13మంది పోలీసులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం మెక్సికో(Mexico)లో గురెరో రాష్ట్రంలోని కోయుక డి బెనిటెజ్ నగరంలో చోటు చేసుకుంది. జాతీయ భద్రత విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి ప్రయాణిస్తోన్న కాన్వాయ్ పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల్లో అధికారి మృతి చెందాడా లేదా అని విషయంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
మికావ్ కాన్ రాష్ట్రంలో టాకంబరో నగరంలో కొందరు దుండగులు నగర మేయర్ సోదరుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. మేయర్ సోదరుడు గాయాలతో తప్పించుకున్నాడు. మెక్సికోలో తరచూ ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం 2006లో అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. అప్పటి నుంచి దుండగుల దాడులు మరింతగా పెరిగాయి.