18న పిరమిడ్‌ ఐపిఒ ప్రారంభం

హైదరాబాద్‌ : ఇండిస్టీయల్‌ ప్యాకేజింగ్‌ కంపెనీ పిరమిడ్‌ టెక్నోప్లాస్ట్‌ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ప్రధానంగా పాలిమర్‌ డ్రమ్ముల తయారీలో ఉన్నా పిరమిడ్‌ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) ఆగస్ట్‌ 18న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణీని రూ.151-166గా నిర్ణయించింది. ఐపిఒ ద్వారా రూ.153 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 92.2 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. వీటిలో 55 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్‌ చేయ నుండగా.. 37.2 లక్షల షేర్లను ప్రమోటర్‌ గ్రూప్‌ క్రెడెన్స్‌ ఫైనాన్సీయల్‌ కన్సల్టెన్సీ ఎల్‌ఎల్‌పి విక్రయానికి ఉంచనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 90 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2022-23 మార్చితో ముగిసిన ఏడాదిలో రూ.482 కోట్ల ఆదాయంతో.. రూ.32 కోట్ల నికర లాభాలు సాధించింది.