కెయిర్న్‌ ఆయిల్‌, గ్యాస్‌ నిల్వల్లో 19 శాతం వృద్ధి

న్యూఢిల్లీ : వేదాంత లిమిటెడ్‌కు చెందిన కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ నిల్వల్లో 19 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆ సంస్థ తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఏడాదిలో మొత్తం రిజర్వ్‌, వనరుల జోడింపులు ఉత్పత్తిని మించిపోయాయని పేర్కొంది. ఫలితంగా 5 బిలియన్‌ బ్యారెల్స్‌ వనరులకు చేరినట్లు కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డిప్యూటీ సీఈఓ స్టీవ్‌ మూర్‌ పేర్కొన్నారు. తమ వాటాదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించేందుకు నిబద్దతను కలిగి ఉన్నామన్నారు.