1920 రిలీజ్‌కి రెడీ

లెజెండరీ ఫిల్మ్‌ మేకర్‌ మహేష్‌ భట్‌ సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన హరర్‌ మూవీ ”1920 : హరర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌”. అవికా గోర్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కష్ణ భట్‌ దర్శకత్వం వహించారు. విక్రమ్‌ భట్‌ ప్రొడక్షన్‌పై రాకేష్‌ జునేజా, శ్వేతాంబరీ భట్‌ డా. రాజ్‌కిషోర్‌ ఖవ్రే నిర్మించారు. జూన్‌ 23న ఈ చిత్రం తెలుగు విడుదల కానున్న నేపథ్యంలో కింగ్‌ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌ గా జరిగింది.
ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కింగ్‌ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ‘మహేష్‌ భట్‌ని కలిసి దాదాపు ఇరవై ఏళ్ళయింది. ముంబై షూటింగ్స్‌కి వెళితే భట్‌ గురించి అడుగుతుంటాను. బ్రహ్మస్త్ర సినిమాలో అలియా భట్‌తో వర్క్‌ చేశాను. ఆ సమయంలో భట్‌ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. భట్‌ నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి దారి చూపించారు. ఆయన పాటలు చేయించుకునే విధానం అద్భుతంగా వుంటుంది. ఇప్పటికీ ‘తెలుసా మనసా’ పాట చేయించిన విధానం గుర్తుకు వస్తుంటుంది. అలాగే ‘జకమ్‌’ లో గలీ మే ఆజ్‌ చాంద్‌ నిక్లా పాట నా ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. 1920 ట్రైలర్‌ లాంచ్‌ చేయడం ఆనందంగా వుంది. వెయ్యికి పైగా స్క్రీన్స్‌లో సినిమా విడుదలవుతుంది. టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. నాకు హారర్‌ సినిమాలు చూడాలంటే భయం. కానీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది. చూడాలనిపించేలా చేశారు. హారర్‌ సినిమాలు చూసినప్పుడు ఆ కిక్కే వేరు. అవికా గోర్‌ డిఫరెంట్‌ పాత్రలు చేస్తుంది. ఈ సినిమా తన కెరీర్‌లో పెద్ద హిట్‌ కావాలి. జూన్‌ 23న ఈ సినిమా వస్తోంది. ఆదిపురుష్‌ మూవీ రిలీజ్‌ సందర్భగా ప్రభాస్‌ అండ్‌ టీంకి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
మహేష్‌ భట్‌ మాట్లాడుతూ.. నాగార్జునని చాలా రోజుల తర్వాత కలవడం ఆనందంగా వుంది. నాగార్జున వల్ల ఈ సినిమాని తెలుగు విడుదల చేయడం సాధ్యపడింది. ఆయనకి మనస్ఫూర్తిగా కతజ్ఞతలు. విక్రమ్‌ భట్‌ ఈ చిత్రానికి చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. ఈ చిత్రానికి సరికొత్త టెక్నాలజీని వాడాం. అవికా గోర్‌, కష్ణ, విక్రమ్‌ అందరూ కలిసి మంచి టీం వర్క్‌ చేశారు. నాగార్జునతో క్రిమినల్‌ సినిమా చేస్తున్న రోజులు గుర్తుకు వస్తున్నాయి. నాగార్జున వాళ్ళ నాన్న విలువలు, సంస్కారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. 1920 కథ కూడా దీని గురించే. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
అవికా గోర్‌ మాట్లాడుతూ.. నాగార్జున నా మొదటి సినిమా ఉయ్యాల జంపాల నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు నా తొలి హిందీ చిత్రం 1920 ట్రైలర్‌ లాంచ్‌కి ఆయన రావడం చాలా ఆనందంగా వుంది. నాగార్జునకు కృతజ్ఞతలు. 1920 చాలా స్పెషల్‌ మూవీ. ఇప్పటివరకూ నేను చేయని జోనర్‌ సినిమా ఇది. ఎమోషన్‌ డ్రామా అన్నీ వుంటాయి. అందరూ థియేటర్‌లో చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
కష్ణ భట్‌ మాట్లాడుతూ.. 1920 నా మనసు నుంచి వచ్చిన చిత్రం. ఇదొక ఎమోషనల్‌ స్టొరీ. హారర్‌లో ఎమోషన్‌ ప్రయత్నించడం ఇదే తొలిసారి. ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు.