1962 సేవలపై, సమస్యలపై పట్టింపులేని ప్రభుత్వం

1962 on services, a government indifferent to issuesనవతెలంగాణ – ఆర్మూర్
1962 సేవలపై, సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైద్యులు కాంతయ్య, అరుణ్ కుమార్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆనాటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా 1962 సంచార పశువైద్య వాహనాలను రాష్ట్రంలోని నియోజకవర్గానికి 1 చొప్పున మొత్తం 100 అంబులెన్సులను 2017వ సంవత్సరం లో ప్రతిష్టత్మాకంగా ప్రారంభించారు. 1962 వాహనాలు గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో మూగజీవులకువైద్యం అందిస్తూ పాడి రైతుల మన్ననలు పొందయి.ఒక్కో అంబులెన్స్ కు ఒక పశువైద్య అధికారి ఒక పారవేట్ డ్రైవర్ హెల్పేర్ లు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది సిబ్బందితో సేవలు అందిస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో పనిచేసే వాహన సిబ్బందికి సకాలం లో జీతాలు రాక అప్పుల ఉబిలో కురుకుపోతున్నారు గత 15 నెలలు గా ప్రభుత్వం 1962 సంచార వాహనాలను నిర్వహిస్తున్న సంస్థకు నిధులు చెల్లించకపోవడం తో 13 నెలలుగా సంస్థ ఉద్యోగులకు సొంతగా జీతాలు చెల్లెస్తుంది గత రెండు నెలల నుండి సంస్థ కూడా ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడం తో ఉద్యోగులు భవిషత్తు అగమ్య గోచారాల మారింది. ప్రభుత్వం నిధులు సకాలం లో ఇవ్వకపోయినా క్షేత్ర స్థాయిలో సేవలకు అంతరాయం కలుగకుండా సేవలు అందిస్తున్నాము ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లో జాప్యం చేస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. అరకొర జీతాలతో..ఉద్యోగుల “పస్తులు,1962 సంచార పశువైద్య వాహన సేవలో అందించే సిబ్బంది అరకొర వేతనాలు అందుతున్న సేవల పట్ల అంకిత భావంతో పని చేస్తూ తమ నిబంధతాను చాటుతున్నారు. అయినప్పటికి ప్రభుత్వం అరకొర వేతనాలు అందిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశువైధ్యానికి అందించే నిధులను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, అందిస్తున్న ప్రస్తుతం పని చేస్తున్న వైద్యులకు 35వేలు, అసిస్టెంట్ కు 14వేలు, డ్రైవర్లకి 8వేలు, మాత్రమే చెల్లెస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులా ప్రకారం పశువైద్యునికి 56వేలు,అసిస్టెంట్ కి 20వేలు, డ్రైవర్లకి 18వేలు, చొప్పున చెల్లించాలని నిబంధన ఉన్నాకూడా అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం 10% ఇంక్రిమెంట కూడా ఇవ్వడం లేద నీ , గత 7 సంవత్సరాల నుండి ఇదే జీతం తో జీవితాన్ని గడుపుతున్న తమ సమస్యలు తీర్చాలని వారు నవతెలంగాణ కు తెలిపారు.