1995- 96 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

నవతెలంగాణ- తిరుమలగిరి
తిరుమలగిరి మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1995-1996 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం మండల పరిధిలోని వంగపల్లి నరసయ్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1995- 96 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ కలయికను నిర్వహించి వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వారంతా వారి హోదాలను మరిచి ఒకరిని ఒకరు కలుసుకొని వారి వారి కుటుంబ పరిస్థితులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన రోజుల్లో గత స్మృతులను  నెమర వేసుకున్నారు. పాఠశాల స్థాయి విద్యను అభ్యసించిన రోజులు ఎంతో విలువైన రోజులని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తపరిచారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలలో తమ విద్యార్థులను తోటి ఉపాధ్యాయులును కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్య నేర్పిన ఉపాధ్యాయులు ఎస్. రామ్ రెడ్డి, మంద పద్మారెడ్డి, కొండల్ రెడ్డి, దేవదాస్, జోసెఫ్, వెంకట నరసయ్య, ఎండి ఆదిల్ పాషా, డి శ్రీనివాస్, మరియు 96 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.