నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పురపాలక సంఘం నూతన కమిషనర్ రామలింగం ను 19వ వార్డు కుమ్మరి వాడ సభ్యులు, మాజీ కౌన్సిలర్ తాడూరి బిక్షపతి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ను సన్మానించిన వారిలో తాడూరి అంజన్న, తాడూరి రవి, వడిచెర్ల మల్లేష్ యాదవ్, తాడూరి మల్లేష్, తాడూరి రాము, తాడూరి కుమార్, చిన్నగారి నరసింహ, చిన్నగారి కృష్ణ లు పాల్గొన్నారు.