నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర యువజన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర యువజన ఉత్సవాల్లో భాగంగా వివిధ పోటీలలో భాగంగా నిర్వహించిన డిక్లమేషన్ (ఉపన్యాస) పోటీలలో వి ఆర్ కే జూనియర్ కళాశాలలో బైపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏ . పూర్వజ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం గెలుచుకొని జాతీయ స్థాయికి ఎంపికైందనీ ఆర్కే సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మిత సబర్వాల్ ఐఏఎస్ ప్రశంసా పత్రాలు అందించారు. జనవరి 12 వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయస్థాయిలో ఢిల్లీలో నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం తరఫున ఉపన్యాసించడానికి వీఆర్కే విద్యార్థి ఎంపికైందన్నారు.
అదేవిధంగా ఫోక్ డ్యాన్స్ విభాగంలో విఆర్కే నుండి శాలిని, రశ్మిత గ్రూప్, పోయెట్రీలో ఆర్కే నుండి హర్షిని, ఎస్సార్కే నుండి డ్రాయింగ్ లో మైత్రేయి లు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచారని ఈ సందర్భంగా పూర్వజ, విద్యార్థి బృందంన్ని అధ్యాపకులను అభినందించారు. ఈ విజయం పట్ల ఆర్కే డీన్ నవీన్ కుమార్, కోఆర్డినేటర్ దత్తాత్రి, ప్రిన్సిపల్స్ సైదయ్య, శంకర్, శివాజీ రావు, శ్రీవాణి అధ్యాపకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.