రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ..

– కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్.
నవతెలంగాణ- భీంగల్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  వచ్చిన వెంటనే రైతులకు ఏకాకాలంలో రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు.  గురువారం   మండలంలోని జాగిర్యాల్, సుదర్శన్ తాండా, సంతోష్ నగర్ తాండ లలో పల్లె పల్లెకు గుండె గుండెకు కాంగ్రెస్  కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా  ముత్యాల సునీల్  రెడ్డి  ఇంటింటి ప్రచారం నిర్వహించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టికి అండగా ఉండి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని వారు చేస్తున్న మాఫీ వడ్డీకి కూడా సరిపోవడం లేదన్నారు. కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు.  అలాగే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్,15వేల రూపాయలను రైతు పెట్టుబడి సాయం,భూమి లేని ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12 వేలు  అందించనున్నామన్నారు. దీంతోపాటు ప్రభుత్వం వచ్చిన తొలి యాడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపారు. ఈసారి కాంగ్రెస్ పార్టికి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్  మండల అధ్యక్షుడు స్వామి, నాయకులు  శివరాం నాయక్, రమేష్, నరసయ్య, గోపాల్ నాయక్ , రవి  బొర్రన్న, అనంతరావు  మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.