
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు రైతులను రాజు చేస్తాం ..రైతు రాజ్యం కోసం కృషి చేస్తామని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు .వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను ప్రభుత్వం ఆదుకున్నప్పుడే రైతు రాజ్యం అవుతుందని అన్నారు. రెండు లక్షల రుణమాఫీని ఒకే విడతలు వచ్చేసి రైతు ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త రుణాలను రుణాలు అందించే విధంగా బ్యాంక్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.గత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులను ఆదుకునేందుకు కౌలు కార్డులను అందించిన విధంగా కౌలు చేస్తున్న రైతులను గుర్తించి కొత్తగా కౌలు కార్డులను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు ఇబ్బంది కలిగే విధంగా రుణమాఫీలో కొత్త విధానాలను తీసుకొస్తే రైతులతో పెద్ద ఉద్యమాలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సాగర్ల మల్లేష్ , యాట యాదయ్య తదితరులు ఉన్నారు.