ఒకే ఏడాది రెండు సినిమాలు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు చేయటం మామూలు విషయం కాదు. ఈ విషయంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ చరిత్ర క్రియేట్ చేశారు. అంతేకాదు వెంట, వెంటనే రెండు సినిమాలతో రెండు వేల కోట్ల కలెక్షన్లు కొల్లకొట్టిన ఏకైక భారతీయ నటుడిగా షారూఖ్ నిలవడం ఓ విశేషమైతే, తన ‘పఠాన్’ సినిమా రికార్డ్‌ని తానే బ్రేక్ చేయటం మరో విశేషం. ఈ ఏడాది ప్రధమార్థంలో విడుదలైన ‘పఠాన్’ సంచలన విజయం సాధించింది. ఇక అట్లీ దర్శకత్వంలో రూపొంది, రిలీజైన ‘జవాన్’ చిత్రం కేవలం 18 రోజుల్లోనే 1005 కోట్లని సొంతం చేసుకుని, మరిన్ని రికార్డ్స్ దిశగా పయనిస్తోంది.