నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 బండల్స్ ల చైన మాంజ పట్టుకున్నట్లు సిసిఎస్ సిఐ అంజయ్య శనివారం తెలిపారు. సిసిఎస్ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి సూచనలతో రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైట్ షాప్స్ పై దాడులు నిర్వహించగా 20 బెండల్స్ చైనామంజా సుమారు పదివేల వరకు ఉంటుందని పట్టుకొని రెండో పోలీస్ షన్లో అప్పగించినట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం రెండో టౌన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.