వర్షం బీభత్సం.. బంధాల ఎర్ర చెరువు తెగి.. 20 దుక్కి ఎద్దులు మృతి

– లింగాల, బంధాల ఏజెన్సీ అతలాకుతలం
– లింగాల రోడ్డు పూర్తిగా ధ్వంసం
నవతెలంగాణ -తాడ్వాయి
విస్తరంగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని లింగాల, బంధాల ఏజెన్సీ అత్తలా కుతులమైంది. లక్షల ఎకరాల విలువ చేసే పంట పొలాలు మీటలు కొట్టి ధ్వంసమయ్యాయి. బంధాల ఎర్ర చెరువు తెగి పోయి వరద ఉధృతికి నాలి జయబాబు, నాలి రామారావు, నాలి ఎర్రయ్య, నాలి లక్ష్మయ్య, అగబోయిన సుధాకర్, చిన్న లక్ష్మయ్య, రామయ్య, నాలి రాంబాబు అని ఆదివాసి రైతులకు చెందిన 20 దుక్కిటెద్దులు కొట్టుకొని పోయి మృత్యువాత పడ్డాయి. మూడు దిక్కుడెద్దులు గల్లంత అయ్యాయి, ఇంకా లభించలేదు. 17 పశువులు మృతదేహాలు లభించాయి. చాలామంది ఆదివాసి రైతుల ఇల్లు కూలిపోయాయి. ఆదివాసి రైతులు రోధనలు మిన్నంటాయి. ఇదే వరద ఉధృతికి పోచాపూర్ గ్రామం మీద ప్రభావం చూపించింది. పోచ పూర్ లో 12 దుక్కిటెద్దులు మృతి చెందాయి. పోచ పూర్ గ్రామ ఆదివాసి రైతులు కూడా రోధనలు మిన్నంటాయి. ఇక లింగాల ఏజెన్సీలో పిడుగు పడి పూణెం రామయ్య అని ఆదివాసి రైతుకు చెందిన దుక్కిటేద్దు మృతి చెందింది. లింగాల చెరువు అలుగుపడి పూసి పారింది. లింగాల స్తూపం నుండి మామిడిగూడెం మీదుగా గుండాల వేసిన డబల్ రోడ్డు బోటిలింగాల వద్ద పూర్తిగా ధ్వంసం అయింది. లింగాల బంధాల బొల్లిపెల్లి కోసాపురం అల్లిగూడెం గ్రామాల ఆదివాసి రైతుల పొలాలు ఇసుక మేటర్ కొట్టి లక్షల విలువ చేసే పంట పొలాలు నాశనం అయిపోయాయి. బంధాల స్థానిక సర్పంచులు ఊకే మోహన్ రావు, పంచాయతీ కార్యదర్శి రమేష్, లింగాల సర్పంచ్ ఊకే మౌనిక నాగేశ్వరరావు, కార్యదర్శి ప్రశాంత్ లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చుకుంటూ ఎప్పటికప్పటికీ సాహాయక చర్యలు చేపడుతున్నారు. లింగాల టూ పస్రా  రోడ్డు కూడా ధ్వంసం అయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. నష్టపోయిన ఆదివాసి రైతులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, పలు ఆదివాసి గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.