20% ఐ.అర్. ప్రకటించాలి..

– కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల నిరసన ప్రదర్శన

నవతెలంగాణ- కంటేశ్వర్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఐదు శాతం మధ్యంతర భృతి ప్రకటించటం పట్ల నిరసనగా గురువారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 20% కు తగ్గకుండా అయ్యార్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. ఇప్పుడున్న జీవన వ్యయ ప్రమాణాలు, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా గౌరవప్రదంగా జీవించటానికి వీలుగా మధ్యంతర భృతిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవితాన్ని గడపటం కోసం మంచి వేతనాలు ఇస్తానని ప్రకటించారని. ఇటీవల ప్రకటించిన ఐ.అర్. దాని కనుగుణంగా లేదని ఐదు శాతం అయ్యారును సవరించి 15% మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు, గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయరావు, జిల్లా నాయకులు లావు వీరయ్య, సిరప్ప హనుమాన్లు, ప్రసాద్ రావు, అందే సాయిలు, లక్ష్మీనారాయణ రాధాకృష్ణ, అశోక్, శ్రీధర్, శంకర్, బాబా గౌడ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.