– ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వేల్లాడి..
నవతెలంగాణ -నిజామాబాద్
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 హెల్త్ సబ్ సెంటర్లకు 4.కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. రూరల్ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో పక్కాభవనాలు కలిగిన హెల్త్ సబ్ సెంటర్లకు ఇక మహర్ధశ పట్టనుంది. రూరల్ లోని 20 ఆరోగ్య ఉప కేంద్రాల మరమ్మతు, పునరుద్ధరణ కోసం సర్కారు నిధులు మంజూరు చేసిందని,ప్రతీ సబ్ సెంటర్‌కు రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ. 4 కోట్ల నిధులను కేటాయిస్తూ వైద్య ఆరోగ్య కుటంబ సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.బ అదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పత్రికా ప్రకటన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు రూరల్ నియోజకవర్గంలో 20 సబ్ సెంటర్లు ఉండగా వాటిలో 20 ఈ భవనాల్లో తాగునీటి సౌకర్యం, కరెంటు, డ్రైనేజీ, మూత్రశాలలు, ప్రహరీ నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ, పేయింటింగ్, రోగులు కూర్చునేందుకు కుర్చీలు, రిజిస్టర్ల నిర్వహణ తదితర పనులకు నిధులను వెచ్చించనున్నారు. తొందర్లోనే ఈ పనులను చేపట్టనున్నాట్లు పేర్కొన్నారు. ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని డిచ్ పల్లి మండలానికి 7 హెల్త్ సబ్ సెంటర్లు గ్రామాలు బర్దిపూర్ ,డిచ్పల్లి, ఘన్ పూర్, నడిపల్లి, రాంపూర్ డి. ధర్మారం బి. సుద్దపల్లి, ఇందల్ వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామానికి ఒక సబ్ సెంటర్ మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు.