నవీ టెక్నాలజీలో 200 మందికి ఉద్వాసన

న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌ ఫౌండర్‌ సచిన్‌ బన్సల్‌ ఆధ్వర్యంలోని స్టార్టప్‌ సంస్థ నవీ టెక్నలాజీ 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇందులో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి చెందిన వారు ఉన్నారు. మిగిలిన ఉద్యోగులు పలు విభాగాలకు చెందిన వారని తెలుస్తోంది. కొన్ని వారాల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిసింది. భవిష్యత్తులో మరి కొంత మందిని ఇంటికి పంపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సంస్థలో 4680 మంది పని చేస్తున్నారు. మరోవైపు నవీ టెక్నాలజీస్‌ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు రానున్న సమయంలో ఈ చర్య చోటు చేసుకోవడం గమనార్హం.