న్యూయార్క్ : ప్రముఖ విత్త సంస్థల సంస్థ సిటీ గ్రూప్‌లో వచ్చే రెండేండ్లలో 20,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ మార్క్ మసోన్ వెల్లడించారు. ఈ బ్యాంక్ 2023 డిసెంబర్ త్రైమాసికంలో 1.8 బిలియన్ డాలర్ల నష్టాలను చవి చూసిన నేపథ్యంలో మార్క్ తొలగింపులు ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సిటీ గ్రూపులో 2,39,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులోంచి 20వేల మందికి ఉద్వాసన పలనున్నట్లు మార్క్ మీడియాతో తెలిపారు. కాగా.. ఈ సంస్థ భారత్‌లో రిటైల్ కార్యకలాపాల నుంచి వైదొలిగింది.