2025.. సంక్రాంతి కానుక విశ్వంభర

Chiruచిరంజీవి నటిస్తున్న 156వ చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్‌ కోసం ఆయన అభిమానులతోపాటు ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర బృందం డబుల్‌ ధమాకా లాంటి అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ని ఖాయం చేయడంతోపాటు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయబోతున్నట్టు మేకర్స్‌ టైటిల్‌ లాంచ్‌ వీడియో గ్లింప్స్‌లో అనౌన్స్‌ చేశారు. ఇక విడుదలైన గ్లింప్స్‌ మనల్ని అద్భుత ప్రపంచంలోకి తీసుకెళుతుంది. అక్కడ ఎవరో మ్యాజికల్‌ బాక్స్‌ని లాక్‌ చేస్తారు. అది అనుకోకుండా కింద పడిపోయి, బ్లాక్‌ హోల్‌ ద్వారా వెళ్తూ ఒక గ్రహశకలంతో ఢ కొడుతుంది. ఇలా అనేక ఆటంకాలు, అడ్డంకులు తర్వాత ఆ మ్యాజికల్‌ బాక్స్‌ చివరకు భూమికి చేరుకుంటుంది. ఇది ఒక పెద్ద హనుమాన్‌ విగ్రహంతో సింబాలిక్‌గా చూపించారు. ఒక బిలం భూమిపైకి దూసుకువస్తుంది. అయినప్పటికీ మ్యాజిక్‌ బాక్స్‌కు ఏమీ జరగదు. చివరిగా ఈ చిత్రం టైటిల్‌ ‘విశ్వంభర’గా రివీల్‌ అవుతుంది. మెగా మాస్‌ బియాండ్‌ ది యూనివర్స్‌ అనేది మన ఊహలకు అందనిది, మ్యాజికల్‌ బాక్స్‌ ప్రయాణం మనం చూడబోయే గొప్ప సినిమా అనుభవంపై కొంత స్పష్టతను ఇస్తుంది. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అత్యున్నతంగా ఉంది. మరీ ముఖ్యంగా ‘విశ్వంభర’ అనే టైటిల్‌ చాలా ఎఫెక్టీవ్‌గా అనిపిస్తుంది. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు చిరు కెరీర్‌లోనే కాస్ట్లీ మూవీ కానుందని చిత్ర బృందం తెలిపింది. సినిమా షూటింగ్‌ ప్రాధమిక దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, డీవోపీ : ఛోటా కె నాయుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సుస్మిత కొణిదెల, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి, సాహిత్యం: శ్రీ శివ శక్తి దత్తా, చంద్రబోస్‌.