209 బస్తాల నల్ల బెల్లం పట్టివేత..

నవతెలంగాణ – అచ్చంపేట 
రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్ బి టీమ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రూట్ వాచ్ నిర్వహిస్తుండగా  లింగాల మండలం శాయిన్‌పేట్ గ్రామంలో డీసీఎం వాహనంలో 209 బస్తాల నల్లబెల్లం తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. డిసిఎంను స్వాధీనం చేసుకున్నారు.జూలూరి ప్రసాద్, వెంకటస్వామి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం తెలకపల్లి ఎక్సైజ్ పోలీసులకు కేసును అప్పగించారు. కార్యక్రమంలో రమణయ్య సిఐ,  బాలరాజు ఎస్ఐ,  సి జనార్దన్, కానిస్టేబుల్  అరుణ్, యాదగిరి, శంకర్ , కృష్ణ , ముజాఫర్ లు ఉన్నారు.