ఆదివాసీల సమస్యలపై 21 ఛలో హైదరాబాద్ ..

21 Chalo Hyderabad on the problems of tribals..– టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదివాసీల సమస్యల పరిష్కారానికై ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టీఏజీఎస్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రం లోని సుందరయ్య భవనం లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆదివాసి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఆదివాసీల రిజర్వేషన్ తొలగింపుకు వ్యతిరేకంగా, ఆదివాసి చట్టాలను అమలు చేయాలని అన్నారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీల అభివృద్ధి విద్య, వైద్యం, భూములకు పట్టాలు, ఉద్యోగ కల్పనా, బ్యాక్గ్ పోస్టులను భర్తీ చేయాలని జనవరి 21న ఛలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎదుట జరిగే ఆదివాసీలా మహాగర్జన ను తెలంగాణ జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలనీ కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత పదేళ్ళ పాలనలో ఆదివాసి హక్కులను తొలగించడం, ఆదివాసి చట్టాలను నీరుగార్చడం, ఆదివాసీలను అడవి నుండి, భూమి నుండి నిరాశ్రయులను చేయటం, అడవుల ప్రైవేటీకరణ పేరుతో నూతన అటవీ చట్టం తీసుకువచ్చి ఆదివాసీల గ్రామసభ 1/70, 5వ, 6వ షెడ్యూల్ హక్కులను కాలరాస్తుందన్నారు. ఈ పదేండ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఆదివాసీల రిజర్వేషన్ క్రమంగా తగ్గించడం, ప్రైవేట్ ఏజన్సీల ద్వారా కాంట్రాక్ట్ పద్దతుల్లో ఏజన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టి గిరిజన రిజర్వేషన్స్ లేకుండా చేస్తుందన్నారు.
రైల్వే, బ్యాంకింగ్, ఎల్ ఐసి, ఎండిఎం, ఆశా, అంగన్వాడీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు ప్రైవేట్ ఏజన్సీల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టడంవల్ల అందులో ఎస్టీ రిజర్వేషన్ అమలు కావడం లేదన్నారు. ఫలితంగా గిరిజన యువత తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఇది పూర్తిగా రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని  ఆదివాసీలకుతీవ్ర నష్టంచేకూరుస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఐటిడిఎల స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారిందని, ఐటిడిఎ ఉత్సవ విగ్రహాలుగా మారి నిర్వీర్యం అవుతున్నాయన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అటవీ హక్కుల చట్టం అమలు కోసం రోడ్డు మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం హక్కు పత్రాలు అందరికీ ఇవ్వాలన్నారు తునికాకు దొరికే అన్ని చోట్ల ఆకు సేకరణ జరపాలన్నారు. టెండర్లు నిర్వహించాలన, తునికాకు కళ్ళాలను యూనిట్ల నుండి మూసివేసే ఆలోచన విరమించుకోవాలి పెండింగ్లో ఉన్న తుని కాకు బోనస్ తక్షణ కూలీల ఖాతాల్లో వేయాలన్నారు. ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ వేయాలని, జీవో ఎంఎస్ నెంబర్ మూడును పునరుద్ధరించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, వలస ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. వ్యవసాయానికి బోర్లు త్రీఫేస్ కరెంటు ఇవ్వాలని, గిరిజనులందరికి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజనులందరికీ రైతు బంధు వర్తింప చేయాలని  రేషన్ కార్డు లేని గిరిజనులందరికి రేషన్ కార్డులు అందించాలన్నారు. సమస్త6 జిల్లా ఉపాధ్యక్షులు కోవా శకుంతల, మంజుల, నాయకులు స్వామి, ఆశన్న, మోహన్, నాయకులు  ఉన్నారు.