రైతులకు రైతుబంధు పథకం కింద 22 కోట్ల 47 లక్షల 77 551

– రైతు బీమా పథకం కింద ఒక కోటి 85 లక్షలు
– రైతు దినోత్సవం లో ఏ ఈ ఓ ప్రియాంక వెల్లడి
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మద్నూర్ వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం రైతు బీమా పథకం అమలు చేస్తున్నట్లు మద్నూర్ క్లస్టర్ పరిధిలో మద్నూర్ ఆవలగావ్ వాడే పత్తేపూర్ ఈ మూడు గ్రామాలు ఉన్నట్లు క్లస్టర్ ఏఈఓ ప్రియాంక తెలిపారు. ఈ రెండు పథకాల ద్వారా రైతులకు రైతుబంధు పథకం కింద 22 కోట్ల 47 లక్షల 77,51 రూపాయి అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ క్లస్టర్ పరిధిలో చనిపోయిన రైతులకు రైతు బీమా పథకం కింద ఒక కోటి 85 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. మద్నూర్ వ్యవసాయ క్లస్టర్ పరిధిలో మొత్తం 2797 మంది రైతును ఉన్నట్లు తెలిపారు రైతు బీమా పథకంలో భాగంగా 37 మంది చనిపోగా వారికి రైతు బీమా పథకం అమలు చేసినట్లు తెలిపారు. ఈ రెండు పథకాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా అమలవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రెండు పథకాలను పకడ్బందీగా రైతులకు అందజేస్తున్నట్లు ఏఈఓ నివేదికలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు పాల్గొన్నారు.