
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కొటార్మూర్ హనుమాన్ మందిరం వద్ద 22 శుక్రవారం తపాల శాఖ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్కీములపై ప్రజలకు అవగాహన కలిగించడానికి మహా మేళాను నిర్వహిస్తున్నట్లు జిడిఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు. సబ్ పోస్ట్ ఆఫీస్ జిరాత్ నగర్ పరిధిలోని పెర్కిట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా టాటా జిఐసి యాక్సిడెంట్ పాలసీ,ఆర్పిఎల్ ఐ ఇన్సూరెన్స్, పి ఎల్ ఐ ఇన్సూరెన్స్,ఎస్ఎస్ఎ అకౌంట్ ఖాతాలు,ఎస్ బి/ఆర్ డి అకౌంట్స్ కూడా తీయబడునని, ఎస్ బి పి ఆర్ ఎం అకౌంట్స్ తీయబడునని పీఎం డబ్బులు ఇప్పించగలమని, ఉపాధి హామీ కొరకు ఖాతాలు ఐపిపిబి తీయబడునని, అలాగే టిడి ఖాతాలు తీయబడునని ఇలా ఎన్నో ఎన్నెన్నో పోస్టల్ సౌకర్యాలను ప్రజలకు అవగాహన కలిగించడానికి మహామేళాను నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమంలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని తపాల శాఖ నూతన స్కీములను సద్వినియోగం చేసుకోవాలని, సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని బిపిఎంల బృందం తరఫున ప్రజల్ని ఆహ్వానిస్తున్నారు.ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరినారు.