ట్రైన్ లో 230 కిలోల బెల్లం స్వాధీనం: ఎక్సైజ్ ఎస్సై

230 kg of jaggery seized in train: Excise Sనవతెలంగాణ – కామారెడ్డి 
గురువారం మహారాష్ట్ర నుండి సికింద్రాబాద్ వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కువ మోతాదులో అనుమాన స్పదంగా సంచులు కనిపించాయి.  దీంతో రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. కామారెడ్డి ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ తన సిబ్బంది, రైల్వే పోలీసు లతో 12 గంటల 30 నిమిషాల సమయంలో కామారెడ్డి రైల్వే స్ స్టేషన్లో రైలు నిలపివేశారు. వెంటనే రైలులో తనిఖీలు చేశారు. అందులో నాటు సారా తయారీకి ఉపయోగించే 100 కిలోల నల్ల బెల్లం, 130 ,కిలోల బెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నామని, బెల్లాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులు సరుకును ఒకచోట ఉంచి మరోచోట కూర్చుని ఉంటారని స్టేషన్లో 10 నిమిషాల సమయం రైలు నిలిపి ఉండడంతో రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకోలేకపోయామని ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ తెలిపారు.  రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకోలేకపోయామని, ఈ అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు, ఎక్కడినుండి చేస్తున్నారని దానిపై రైల్వే పోలీసులు ఎక్సైజ్ శాఖ కలిసి విచారణ జరుపుతున్నామని  ఆయన తెలిపారు.  ఈ తనిఖీలలో రైల్వే ఎస్సై, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.