నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని ఇస్సాపల్లి గ్రామ లక్ష్మి నరసింహ సహిత రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఈనెల 23 గురువారం నిర్వహిస్తున్నట్టు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి పూజ యజ్ఞం అభిషేకాలు స్వామివారి కళ్యాణం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరినారు.