
నవతెలంగాణ – తాడ్వాయి
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీకు నుండి 15వ తారీకు వరకు నాలుగు రోజులు జరిగే మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు తాగు నీటి సౌకర్యార్థం 24.70 లక్షలతో త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈ ఈ మాణిక్యరావు తెలిపారు. సోమవారం మేడారం సందర్శించి వనదేవతలను దర్శించుకుని, పరిసరాలను, మిషన్ భగీరథ ట్యాంకులను పరిశీలించారు. మినీ జాతరకు ప్రధాన ప్రాంతాల్లో పైప్ లైన్ ద్వారా నీటిని అందించినట్లు తెలిపారు. మినీ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. భక్తులు ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలు క్యూలైన్లు, చిలకలగుట్ట, ఆర్టిసి బస్టాండ్, జంపన్న వాగు వంటి ప్రాంతాల్లో నల్లాల ద్వారా సరఫరా చేయనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆలయం లోపల భాగంలో ఉన్న క్యూలైన్లో కూడా డ్రమ్ముల ద్వారా దాహార్తిని తీర్చనున్నట్లు తెలిపారు. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి మంచినీటి కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు మిషన్ భగీరథ అధికారులు ఈఈ, మాణిక్యాలరావు తెలిపారు. ఆయన వెంట డి ఈ సునీత, సతీష్ కుమార్, ఏఈ నవీన్ లు ఉన్నారు.