నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈ నెల 24 నుండి ఉచిత ఫోటోగ్రఫీ, వీడియో గ్రామీణ పై శిక్షణా తరగతులను స్టేట్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డిచ్ పల్లి అధ్వర్యంలో నిర్వహించాడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉచిత శిక్షణా కు గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు చాలా మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రీషియన్ శిక్షణా ఈ నెల 27 నుండి ప్రారంభం అవుతున్నట్లు డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు.