నవతెలంగాణ-చేగుంట
చేగుంట మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 టచ్ రగ్బీ పోటీ లకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు, క్రీడాకారినిలు పాల్గొన్నారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ చూపిన 12 మంది బాలురు 12 మంది బాలికలను రాష్ట్రస్తాయి పోటీలకు ఎంపిక చేయ డం జరిగిందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు.బాలుర విభాగంలో మంచి ప్రతి భ చూపిన క్రీడాకారులు రోహిత్, భరత్, మనోహర్, వంశీకష్ణ, చరణ్, భాను, విజరు, మణికంఠ, రాకేష్, బిట్టు, చాణిక్య, అభిచరణ్ ఎంపికవగా స్టాండ్ బైగా సాయి, రెశ్వంత్, హర్షవర్ధన్, కార్తీక్, దుర్గని విశాల్ ఉన్నారని, బాలికల విభాగంలో గాయత్రి, లాస్య, దివ్య, కావ్య, అక్షయ, వర్షశ్రీ, సారిబా, నందిని, అఖిల, వైష్ణవి, వర్ష, రాణి కుమారి ఎంపికవగా స్టాండ్ బైగా వైష్ణవి, సాహితి, లక్ష్మీ ప్రసన్న, అనురాధ, సెలెక్ట్ అయినారని ఆయన తెలిపారు. ఇక్కడ సెలక్ట్ అయిన బాల, బాలికలు ఈ నెల చివరి వారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భూపాల్ రెడ్డి, పిడి వెంకటేష్, సతీష్,రఫీ రెఫరీలు బాలరాజ్, చంటి, తదితరులు పాల్గొన్నారు.