– పింఛన్ల పెంపునకు ఆమోద ముద్ర!
– ఈ బడ్జెట్‌లోనే కేటాయింపులకు అవకాశం
– మహిళలకు ఆర్థిక సహాయంపై సిద్ధం కాని ప్రతిపాదనలు!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ సారి రూ.24 వేల కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్టు తెలిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో సత్వరం లబ్ది చేకూర్చే పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే పింఛన్ల పెంపునకు ఈ బడ్జెట్‌లో ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మంది లబ్దిదా రులున్నారు. కొత్తగా లక్షకుపైగా లబ్ది దారులు చేరే అవకాశముంది. ఇప్పటి వరకు ఏటా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. ప్రతి లబ్దిదారునికి రూ.2 వేలను అందజేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో దాన్ని నాలుగు వేలకు పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు లబ్దిదారులకు పింఛన్లు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా మరో వెయ్యి కోట్ల రూ పాయల భారం పడే అవకాశముంది. పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో పింఛన్ల పెంపు ప్రకటనను ఈ బడ్జెట్‌లోనే చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అందుకోసం ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటికి నిధులు కూడా కేటాయించినట్టు తెలిసింది. మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయంపై మాత్రం ఇప్పటివరకూ గైడ్‌లైన్స్ ఖరారు కాలేదు. దీంతో ప్రస్తుత బడ్జెట్‌లో దీనికి సంబంధించి ప్రతి పాదనలు లేనట్టేనని తెలుస్తున్నది. అన్ని పథ కాలకూ కీలకంగా మారిన రేషన్‌కార్డుల జారీపైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతున్నట్టు విశ్వసనీయ సమా చారం. సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మంజూరుపైనా తీపికబురు అందిం చబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే మూడు దశల్లో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసే కార్య క్రమం మొదలు కావటం, మరోవైపు పంచా యతీ రాజ్ శాఖకు సంబంధించిన నిధుల్లో పథ కాలకు, ప్రాధాన్యతా రంగాలకు కేటాయించాలని నిర్ణయించడం వంటి అంశాలను పరిశీలిస్తే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది.