నవతెలంగాణ- చండూరు
మున్సిపల్ పట్టణంలో 25 తులాల బంగారం చోరీ జరిగిన సంఘటన శనివారం మున్సిపల్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ కేంద్రానికి చెందిన మొగుదాల కవిత ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బీరువలో దాచిన లాంగ్ చైన్, చంద్రహారం, నక్లెస్, చైన్, రింగ్ లు, చెవి కమ్మలు, బిస్కెట్ బంగారం మొత్తం కలిపి సుమారు (25 తులాలా బంగారం), 50 తులాల వెండి, 70 వేల రూపాయలు నగదు ను
దొంగిలించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దయతో చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.